SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు చేసిందా

SRH New Captain: ఐపీఎల్ 2024 వేలంతో ఆరెంజ్ ఆర్మీ వ్యూహం మార్చుకుంది. ఈసారి టైటిల్‌పై దృష్టి సారించినట్టుంది. అందుకే జట్టులో సమూల మార్పులకు సిద్ధమైంది. జట్టు సారధిని మార్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 20, 2023, 11:36 AM IST
SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ?  అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు చేసిందా

SRH New Captain: ఐపీఎల్ 2024 వేలంలో 34 కోట్లతో రంగంలో దిగిన సన్‌రైజర్స్ ఆర్మీ కావల్సిన ఆటగాళ్లపై ఫోకస్ చేసింది. అనుకున్నవారిలో ఒకరు మినహా మిగిలినవారిని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచకప్ హీరోలిద్దరిని చేజిక్కించుకుంది. వచ్చే సీజన్‌లో జట్టు రధ సారధినే మార్చే ఆలోచనతో ఉంది యాజమాన్యం.

ఐపీఎల్ 2024 వేలంలో  ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు అత్యంత భారీ ధర 20.50 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. మరో ప్రపంచకప్ హీరో ఆల్ రౌండర్ ట్రేవిస్ హెడ్‌ను 6.80 కోట్లకు దక్కించుకుంది. ఈ ఇద్దరినీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లతో పోటీ పడి దక్కించుకుంది. ఇక శ్రీలంకకు చెందిన వనిందు హసరంగాను అతని బేసిక్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. ఈ ముగ్గురితో పాటు జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝుత్వేద్ సుబ్రహ్మణ్యంను కొనుగోలు చేసి మరో 3 కోట్లు వ్యాలెట్ మిగుల్చుకుంది. 

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కోసం 20 కోట్లు వెచ్చించడానికి కారణం వేరే ఉంది. అతడో సమర్ధవంతమైన కెప్టెన్. జట్టుని నడిపించడంలో ప్యాట్ కమ్మిన్స్ సామర్ధ్యం అందరికీ తెలిసిందే. ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియాను మరోసారి నిలబెట్టడంతో ప్యాట్ కమ్మిన్స్ పాత్ర కీలకం. అందుకే అతడిపై కన్నేసింది ఆరెంజ్ టీమ్ యాజమాన్యం. వచ్చే సీజన్‌కు జట్టు సారధ్యం అతడికి అప్పగించేందుకే అంత భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా మార్క్‌రమ్ వ్యవహరిస్తున్నాడు. రానున్న సీజన్‌కు ప్యాట్ కమ్మిన్స్‌కు బాధ్యత అప్పగించే అవకాశాలున్నాయి. 

సన్‌రైజర్స్ ఆటగాళ్లు ( 25)

అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి నటరాజన్, అన్మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండేవ్, ఉపేంద్రసింగ్ మార్కండేవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజులుల్ హక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్

ఐపీఎల్ 2024 వేలంలో..

ట్రేవిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝుత్వేద్ సుబ్రహ్మణ్యం

Also read: Robin Minz: చదివింది పదో తరగతి, ఐపీఎల్‌లో మాత్రం కోట్ల సంపాదన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News