IPL 2024: KKR దెబ్బకు పాయింట్ల పట్టికలో పెను మార్పులు.. అట్టడుగుకు ముంబై.. టాప్ ఫ్లేస్ ఎవరిదంటే?

DC VS KKR Match: వైజాగ్ మ్యాచులో ఢిల్లీపై కేకేఆర్ గెలవడంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ టాప్ ఫ్లేస్ కోల్పోగా... ఢిల్లీ ఆఖరి రెండు స్థానాల్లో నిలిచింది.  

Written by - Samala Srinivas | Last Updated : Apr 4, 2024, 05:01 PM IST
IPL 2024: KKR దెబ్బకు పాయింట్ల పట్టికలో పెను మార్పులు.. అట్టడుగుకు ముంబై.. టాప్ ఫ్లేస్ ఎవరిదంటే?

IPL 2024 Points table updated: ఈసారి ఐపీఎల్ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. జట్లన్నీ నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. బుధవారం ఢిల్లీ-కేకేఆర్ మధ్య జరిగన మ్యాచ్ తో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కీలక చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ టాప్ ఫ్లేస్ ను కోల్పోయింది. నిన్న ఢిల్లీని చావుదెబ్బ కొట్టడం ద్వారా కేకేఆర్ రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక సీఎస్కే మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగతా జట్లు ఏ పొజిషన్ లో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. 

టాప్ ప్లేస్ కోల్పోయిన రాజస్థాన్..
ఈ 17వ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి హ్యాట్రిక్ విజయాలతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఆ జట్టు ఆరు పాయింట్లతో +2.518 నెట్‌ రన్‌రేట్‌ సాధించి తొలి స్థానంలో కొనసాగుతోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. రాయల్స్ +1.249 నెట్ రన్‌రేట్‌తో మొత్తం 6 పాయింట్లు సాధించింది. రుతురాజ్ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 1 ఓటమితో మూడో స్థానం దక్కించుకుంది. సీఎస్కే మొత్తం 4 పాయింట్లతో +0.976 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. 

సన్‌రైజర్స్ స్థానం ఎంతంటే?
ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో లక్నో సూపర్ జెయింట్స్ మూడు మ్యాచుల్లో రెండు గెలిచి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రాహుల్ సేన 4 పాయింట్లతో +0.483 రన్ రేట్ ను సాధించింది. ఇక ఐదో స్థానంలో గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఆ జట్టు మూడు మ్యాచుల్లో రెండు గెలుపొంది -0.738 రన్ రేట్ ను సాధించింది. ఆ జట్టుకు నాలుగు పాయింట్ల దక్కాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి రెండు పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది.  ప్రస్తుతం ఆ టీమ్ +0.204 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచి రెండు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు రన్ రేట్ -0.337గా ఉంది. 

Also Read: KKR vs DC Live Score: వైజాగ్ లో కేకేఆర్ పరుగుల సునామీ.. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో అత్య‌ధిక స్కోరు..

చివరి మూడు స్థానాల్లో..
ఇక డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆర్సీబీ ఖాతాలో కేవలం రెండు పాయింట్ల మాత్రమే ఉన్నాయి. నెట్ రన్ రేట్ -0.876గా ఉంది. పంత్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచి -1.347 రన్ రేట్ తో రెండు పాయింట్లు సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక చివరి స్థానంలో పాండ్యా కెప్టెన్ గా గల ముబై ఇండియన్స్ ఉంది. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి అట్టడుగున ఉంది. 

Also Read: IPL 2024: మాంచి ఊపు మీదున్న రాహుల్ సేనకు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ ఔట్.. కారణం ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News