IPL 2024 Data Plans: మ్యాచ్‌లు చూసేందుకు ఇబ్బందిగా ఉందా, 49 రూపాయలకే కావల్సినంత డేటా

IPL 2024 Data Plans: ఐపీఎల్ 2024 ప్రారంభమైపోయింది. అప్పుడే మొదటి మ్యాచ్ ముగిసింది. జియో సినిమాలో ఫ్రీ స్ట్రీమింగ్ ఉండటంతో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ పెరుగుతోంది. అయితే డేటా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2024, 07:18 AM IST
IPL 2024 Data Plans: మ్యాచ్‌లు చూసేందుకు ఇబ్బందిగా ఉందా, 49 రూపాయలకే కావల్సినంత డేటా

IPL 2024 Data Plans: క్రికెట్ ప్రేమికులకు పండుగ సీజన్ మొదలైంది. ఏకధాటిగా 50 రోజులు కొనసాగనున్న ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. మీక్కావల్సిందల్లా డేటా మాత్రమే. డేటా ఉంటే చాలు ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు ఎలాంటి అంతరాయం లేకుండా చూడవచ్చు. అందుకే రిలయన్స్ జియో కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకు డేటా ప్లాన్స్ అందిస్తోంది. 

జియో అందిస్తున్న డేటా ప్లాన్స్‌లో ముఖ్యమైంది 49 రూపాయల ప్లాన్. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. బేసిక్ ప్లాన్ అందుబాటులో ఉంటేనే ఇది వర్తిస్తుంది. ఈ ప్లాన్ తీసుకుంటే 25 జీబీ డేటా లభిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు ఇది మంచి ప్లాన్. ఒకరోజే పనిచేస్తుంది. ఎయిర్‌టెల్‌లో కూడా 49 రూపాయలకే 20 జీబీ డేటా లభిస్తోంది. ఒకేరోజు ఎక్కువ డేటా అవసరమైతే ఈ రెండు ప్లాన్స్ లాభదాయకంగా ఉంటాయి. లేకపోతే వృధా కాగలవు. ఎందుకంటే ఒక్కరోజుతో ఈ డేటా ముగిసిపోతుంది. 

ఇక రెండవది జియో అందిస్తున్న 222 రూపాయల ప్లాన్. ఇది కూడా కేవలం డేటా వోచర్ మాత్రమే. అయితే బేసిక్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంతవరకూ ఇది పనిచేస్తుంది. ఒక్కరోజులో పూర్తికాదు. ఇందులో 50 జీబీ డేటా లభిస్తుంది. ఒకవేళ మీరు 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన బేసిక్ ప్లాన్ వినియోగిస్తుంటే అప్పటి వరకూ ఉపయోగించుకోవచ్చు. మీ బేసిక్ ప్లాన్‌లోని డేటాకు ఇది అదనం. 

మరో ప్లాన్ 121 రూపాయలు. ఇందులో 12 జీబీ డేటా లభిస్తుంది కానీ బేసిక్ ప్లాన్ ఉన్నంతవరకూ పనిచేస్తుంది. ఒక్కరోజులో ముగిసే వోచర్ కాదు. అందుకే 49 రూపాయల డేటా వోచర్ ప్లాన్‌తో పోలిస్తే 121 రూపాయల జియో ప్లాన్ చాలా బెస్ట్. ఇవి కాకుండా 444 రూపాయలు, 667 రూపాయల డేటా ప్లాన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా ఐపీఎల్ 2024 ప్రీ స్ట్రీమింగ్ ఉండటంతో ఇక ఇది ముగిసేవరకూ ప్రతి ఒక్కరికీ డేటా చాలా అవసరమౌతుంటుంది. 

Also read: IPL 2024 CSK vs RCB: మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమికి కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News