RR vs LSG Dream11 Prediction: మరికాసేపట్లో రాజస్థాన్ vs లక్నో మ్యాచ్.. ప్లేయింగ్‌ 11 ఇదే..!

RR vs LSG Dream11 Prediction: మరికాసేపట్లో జైపూర్ వేదికగా సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడునున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ రిపోర్టు, ఇరు జట్ల బలబలాలు ఏంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 24, 2024, 01:53 PM IST
RR vs LSG Dream11 Prediction: మరికాసేపట్లో రాజస్థాన్ vs లక్నో మ్యాచ్.. ప్లేయింగ్‌ 11 ఇదే..!

IPL 2024, RR vs LSG Dream11 Prediction: రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్‌తో ఆడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆదివారం జరిగే మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని ఇరు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మ్యాచ్ కు ముందే రెండు జట్లు కీలక పేసర్లను (ప్రసిద్ కృష్ణ-RR మార్క్ వుడ్-LSW)  కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఏంటో తెలుసుకుందాం. 

రాజస్థాన్ రాయల్స్ బలాలు: 
రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ వంటి హిట్టర్లు ఉన్నారు. యశస్వి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్ తో సిరీస్ లో ఈ కుర్రాడు ఎలా రెచ్చిపోయాడో మనం చూశాం. టెస్టుల్లోనే ఆ విధంగా ఆడితే.. ఇక టీ20ల్లో ఎలా చెలరేగుతాడో ఓసారి ఆర్థం చేసుకోవడం మంచిది. మిడిలార్డర్ లో రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ధ్రువ్ జురెల్ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. ఇక బౌలింగ్ లో అయితే ట్రెంట్ బౌల్ట్ తోపాటు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ స్టార్ స్పిన్నరు ఉన్నారు.  
తుది జట్టు అంచనా
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ధ్రువ్ జురెల్, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్.

లక్నో సూపర్ జెయింట్స్ బలాలు:
ఇక లక్నో విషయానికొస్తే.. రాహుల్, క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. దేవదత్ పడిక్కల్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్ వంటి యువ ఆటగాళ్లు చెలరేగి ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక బౌలింగ్ లో కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, షమర్ జోసెఫ్ వంటి వారు ఉన్నారు. అయితే రాజస్థాన్ తో పోలిస్తే లక్నో బౌలింగ్ విషయంలో కాస్త వీక్ అనే చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. 
తుది జట్టు అంచనా
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (WK), నికోలస్ పూరన్, దేవదత్ పడిక్కల్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, షమర్ జోసెఫ్.

Also Read: KKR Vs SRH Highlights: ఉత్కంఠభరిత పోరు.. క్లాసెన్ ఊర మాస్ ఇన్నింగ్స్.. చివరి బంతికి ఓడిన ఎస్‌ఆర్‌హెచ్

వెదర్ రిపోర్టు
జైపూర్‌లో ఉష్ణోగ్రత ఆదివారం 21 డిగ్రీల సెల్సియస్ మరియు 36 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం తక్కువ. 
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర ఖాన్ చాహల్, అవేశ్వేంద్ర ఖాన్ చాహల్, , రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్.

Also Read: IPL 2024 SRH vs KKR: క్షణాల్లో మారిన సీన్, పాపం కావ్య పాప..సోషల్ మీడియాలో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News