KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి

KCR Hot Comments MLAs Touch With BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇచ్చారు. తనతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి ప్రకంపనలు రేపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 18, 2024, 07:04 PM IST
KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి

KCR Sensation: ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ అనే వార్తలు విన్నారు. కానీ తొలిసారి కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ను ప్రమాదంలో పడేశారు. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారని ప్రకటన చేసి కలకలం రేపారు. ఓ సీనియర్‌ నాయకుడు తనతో సంప్రదింపులు చేశారని కీలక ప్రకటన చేశారు.

Also Read: Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థులకు కేసీఆర్‌ బీఫామ్‌లు, రూ.95 లక్షలు ఎన్నికల నిధిని ఇచ్చారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులతోపాటు పార్టీ సీనియర్‌ నాయకులతో చర్చించారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మన పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారు. తాము అధికారం ఉందని కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు' అని తెలిపారు. '20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రానా సార్ అని నన్ను సంప్రదించాడు. ఇప్పుడే వద్దని వారించాను' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: BRS Party: గులాబీ పార్టీకి భారీ దెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి

 

కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. '104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా  కాంగ్రెస్‌ పార్టీని బతకనిస్తారా' అని ప్రశ్నించారు. అత్యధిక స్థానాలు పార్టీ సొంతం చేసుకుంటుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో గులాబీ శ్రేణులు జోష్‌లో మునిగాయి. ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో పని చేసి ఎంపీలను గెలుచుకురావాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ సూచించారు.

దిశానిర్దేశం
సమావేశంలో కేసీఆర్‌ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 22వ తేదీ నుంచి రోడ్డు షోలు ప్రారంభం కావాలని చెప్పారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ సెగ్మెంట్‌లో  భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ప్రాంతాల్లో రోడ్డు షోలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రోజుకు రెండు, మూడు రోడ్డు షోలు ఉండాలని ప్రతిపాదించారు. సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహణకు ప్రణాళిక రచించారు. ఉదయం రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News