తెలంగాణలో జర్నలిస్టులకి ఆన్‌లైన్‌లో బస్ పాస్‌లు

జర్నలిస్టులకి బస్ పాస్‌లకి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

Last Updated : Feb 5, 2018, 10:15 PM IST
తెలంగాణలో జర్నలిస్టులకి ఆన్‌లైన్‌లో బస్ పాస్‌లు

తెలంగాణలో జర్నలిస్టులకు జారీ చేసే బస్‌పాస్‌ల్ని ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ మేనెజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్నీ రీజినల్, జిల్లా, డిపో మేనేజర్లకు సోమవారం ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రస్తుత బస్‌ పాస్‌ల గడువు మార్చి నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఇకపై జారీ అయ్యే జర్నలిస్ట్ బస్ పాస్‌ల ప్రక్రియ కోసం టీఎస్ఆర్టీసీ ఎండీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అక్రిడిటేషన్‌ కార్డులు కలిగి వున్న విలేకరులు www.online.tsrtcpass.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ దరఖాస్తును సంబంధిత జిల్లా ప్రజా సంబంధాల అధికారి పరిశీలిస్తారు. అనంతరం బస్ పాస్ జారీకి సంబంధించిన కౌంటర్ వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ జర్నలిస్టు మొబైల్ నెంబర్‌కి పంపిస్తారు. అందులోని వివరాల ఆధారంగా దగ్గర్లోని బస్ పాస్ కౌంటర్‌కి వెళ్లి, అక్రిడేషన్ కార్డు రిజిస్ట్రేషన్ నెంబర్‌ని చూపించి బస్ పాస్ తీసుకోవడమే. ఈ నూతన ప్రక్రియ ద్వారా జర్నలిస్టులు ఆర్టీసీ కార్యాలయాలు, జిల్లా ప్రజా సంబంధాల అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగే పని వుండదు అని ఆర్టీసీ ఎండీ తెలిపారు.

Trending News