JP Nadda: పాలమూరుకు నడ్డా..గెలుపే లక్ష్యంగా టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన బీజేపీ

JP Nadda: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఇవాళ మహబూబ్‌ నగర్‌లో కాషాయదళం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 07:56 AM IST
  • తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు
  • తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయాలపై చర్చింనున్న నడ్డా
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్‌ పాదయాత్ర
JP Nadda: పాలమూరుకు నడ్డా..గెలుపే లక్ష్యంగా టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన బీజేపీ

JP Nadda: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పాలమూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఇవాళ మహబూబ్‌ నగర్‌లో కాషాయదళం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సహా మిగిలిన ఐదు జిల్లాల నుంచి బీజేపీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి పాలమూరు జిల్లా 21 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి..స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ప్రజలతో మాటామంతి నిర్వహిస్తూ టీఆర్ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు ఎంపీ బండి సంజయ్. యాత్రలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న బండి సంజయ్‌ జేపీ నడ్డా దృష్టికి తీసుకురానున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించబోతారో ఈ మీటింగ్‌ ద్వారా వివరించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 8 ఏళ్ల టీఆర్ఎస్‌ పాలన వైఫల్యాలను మహబూబ్‌ నగర్‌ సభలో ఎండగట్టనున్నారు బీజేపీ నేతలు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి మధ్యాహ్నాం 12గంటల 40 నిమిషాలకు చేరుకోనున్నారు. నోవాటెల్‌లో భోజనం చేసుకొని..రోడ్డు మార్గం ద్వారా మహబూబ్‌నగర్‌కు బయల్దేరతారు. మధ్యాహ్నాం 3 గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. పదాధికారుల సమావేశంలో తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం..పార్టీ భవిష్యత్‌ కార్యచరణపై రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మహబూబ్‌ నగర్‌లో బహిరంగ సభలో జేపీ నడ్డాతో పాటు ఆ పార్టీ కీలక నేతలు మీటింగ్‌లో పాల్గొంటారు. బహిరంగ సభలో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పలు పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగావేయడమే లక్ష్యంగా మహబూబ్‌ నగర్‌ సభను బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికేలా మహబూబ్‌ నగర్‌ బహిరంగ సభను సక్సెస్‌ చేయాలని బీజేపీ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

 

Also Read: Skin Glow With Egg: గుడ్డుతో ముఖం మెరిసిపోతుందా? ఉపయోగించడానికి సరైన పద్ధతులను తెలుసుకోండి

Also Read: BOI బ్యాంక్‌లో బంపర్‌ రిక్రూట్‌మెంట్‌..స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

Also Read: Yogi Adityanath: సీఎం అయ్యాక మొదటిసారి తన తల్లిని కలుసుకున్న యోగి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News