KTR Fire:కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

KT Rama Rao Fire On Party Jumpings: పదేళ్లలో అధికారం, పదవులు పొంది ఇప్పుడు పార్టీని వీడుతున్న వారిపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. మళ్లీ వస్తామని కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వారిని రానిచ్చేది లేదని గులాబీ పార్టీ స్పష్టం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 29, 2024, 10:24 PM IST
KTR Fire:కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

KTR: అధికారం కోల్పోయి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో నమ్మకంగా ఉంటూ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న వారిపై.. పార్టీని వీడుతున్న వారిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేకే, గద్వాల్‌ విజయలక్ష్మి, కడియం శ్రీహరి, కావ్య పార్టీ మార్పుపై పరోక్షంగా స్పందించిన కేటీఆర్‌ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాళ్లు మళ్లీ కేసీఆర్‌ కాళ్లు పట్టుకుని తిరిగివస్తామని చెబితే అస్సలు రానివ్వం' అని ప్రకటించారు.

Also Read: Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌

 

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన చేవెళ్ల పార్లమెంట్‌ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్న వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీలోకి రానివ్వమని ఖరాఖండీగా చెప్పేశారు. 'రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు' అని హితవు పలికారు. పట్నం మహేందర్‌ రెడ్డికి పదవి ఇచ్చినా పార్టీ మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నం మహేందర్‌ రెడ్డిని ఇంటిదొంగగా అభివర్ణించారు. ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని సామెత ఉదాహరించారు.

Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్‌ సంచలన సవాల్‌

 

కానీ అలాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్‌ జోష్యం చెప్పారు. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి వంటి నాయకులను జనం క్షమించరని స్పష్టం చేశారు. చేవెళ్లలో గెలిచేది కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కోసం మనం పని చేయాలని పార్టీ కేడర్‌కు మార్గనిర్దేశం చేశారు. పార్టీ మారినోళ్లు ఆస్కార్‌ అవార్డు స్థాయి కంటే ఎక్కువ నటించారని ఎద్దేవా చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News