VIPs Drivers: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రముఖుల డ్రైవర్లకు 'ఫిట్‌నెస్‌ టెస్టులు'

VIPs Vehicle Drivers Fitness Test: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మృతి తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది...

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 24, 2024, 06:06 PM IST
VIPs Drivers: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రముఖుల డ్రైవర్లకు 'ఫిట్‌నెస్‌ టెస్టులు'

Lasya Nanditha Accident Effect: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదానికి కారణం వాహనం నడిపిన డ్రైవర్‌ ఆకాశ్‌. అతడి వలనే లాస్య నందిత తరచూ ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నల్లగొండలో కేసీఆర్‌ నిర్వహించిన బహిరంగ సభకు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురయ్యింది. రెండో ప్రమాదంలో ఎమ్మెల్యేనే ప్రాణాలు కోల్పోయింది. గతంలో కూడా వీఐపీలు వాహన డ్రైవర్ల తప్పిదాలతో ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వీఐపీల డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

Also Read: Constable Exam: నిరుద్యోగులకు అలర్ట్‌.. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల పరీక్ష రద్దు

హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి ప్రభాకర్‌ మాట్లాడుతూ.. 'వీఐపీల డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియను మూడు, నాలుగు రోజుల్లోనే ప్రారంభిస్తాం' అని ప్రకటించారు. ఫిట్‌నెస్‌ టెస్టు కోసం అందరికీ లేఖలు రాస్తున్నట్లు తెలిపారు. రవాణా శాఖ స్వతహాగా వీఐపీల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. లాస్య నందిత ప్రమాదంతో రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. యువ ఎమ్మెల్యే ఎంతో భవిష్యత్‌ ఉన్న రాజకీయ నాయకురాలు డ్రైవర్‌ నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా ఆమె ప్రాణాలు పోయాయి. ఆమె సంఘటన అందరినీ కలచివేస్తోంది.

Also Read: Modi: నీ మొగుడితో గొడవ జరిగితే మాత్రం మోదీ పేరు చెప్పొద్దు.. మహిళలతో ప్రధాని జోకులు

ఇదే సమావేశంలో మంత్రి ప్రభాకర్‌ ఉచిత బస్సు కార్యక్రమం అమలుపై మాట్లాడారు. 'మహాలక్ష్మి పథకం కింద కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొడితే చర్యలు తీసుకుంటాం. గతంలో నిత్యం 44 లక్షల ప్రయాణాలు ఉంటే ఉచిత బస్సు ప్రయాణంతో 55 లక్షలకు పైగా ఉంది' అని వివరించారు. ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 'అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం ఇస్తామన్న రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని ఇస్తాం. ఆటో డ్రైవర్లు ఇబ్బందుల్లో లేరు. ఇబ్బందుల్లో ఉంటే కొత్త ఆటోలు ఎందుకు కొనుగోలు చేస్తారు' అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గత నాలుగు నెలల్లో జరిగిన ఆటో అమ్మకాల వివరాలు తెలిపారు.

కాగా రవాణా శాఖ ఫిట్‌నెస్ టెస్టు నిర్ణయంపై సానుకూల స్పందన కనిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రమాదంతో రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షిస్తున్నారు. ప్రభుత్వం స్వతహాగా స్పందించి డ్రైవర్లకు ఫిట్‌నెస్ట్‌ టెస్టులు చేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నారు. వీఐపీల డ్రైవర్లు అంటే ఎవరు? అనే సందేహాలు వస్తున్నాయి. మంత్రి ప్రకటన చూస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన డ్రైవర్లకు ఈ ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రజల కోసం జీవించే నాయకుల పట్ల మరింత భద్రత చర్యలు ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ క్రమంలోనే రవాణా శాఖ 'ఫిట్‌నెస్‌ టెస్టులు'కు ముందుకొచ్చినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News