Dande Vithal: బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌.. ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక రద్దు

Telangana High Court Verdict MLC Dande Vithal Election Invalid: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 3, 2024, 02:32 PM IST
Dande Vithal: బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌.. ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక రద్దు

Dande Vithal: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడుతున్న సమయంలో గులాబీ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా జరిమానా విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కుదేలైంది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు దండె విఠల్‌ సిద్ధమయ్యారు.

Also Read: Manifesto: 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందా?

 

ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి దండె విఠల్‌ ఎన్నికయ్యారు. ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన పాతిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి ఓడిపోయారు. అయితే విఠల్‌ ఎన్నిక చెల్లదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని రాజేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌ వేశారు. దీనిపై రెండేళ్లుగా విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. దండె విఠల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని తీర్పునిస్తూనే రూ.50 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Also Read: Revanth AP Tour: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జోరు.. వైఎస్‌ షర్మిల కోసం రంగంలోకి రేవంత్‌, రాహుల్‌

 

ఆదిలాబాద్‌ స్థానిక స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి విఠల్‌ పోటీ చేసి 667 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2021 డిసెంబర్‌ 14వ తేదీన ఎమ్మెల్సీగా విఠల్‌ ఎన్నికయ్యారు. 21 ఫిబ్రవరి 2022న శాసన మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

కేసు ఏమిటి?
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పాతిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను నామినేషన్‌ ఉపసంహరించుకోలేదని.. అప్పటి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఫోర్జరీ సంతకాలతో తన నామినేషన్‌ ఉపసంహరించేలా చేశారని పాతిరెడ్డి ఆరోపించాడు. ఎన్నిక ముగిసిన వెంటనే పాతిరెడ్డి న్యాయస్థానం ఆశ్రయించారు. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో రాజకీయాలు మారాయి. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్‌ పార్టీ ఉండడంతో ఫలితం పాతిరెడ్డికి అనుకూలంగా వచ్చింది. అధికారం మారడంతోనే అతడికి న్యాయం జరిగిందనే ప్రచారం జరుగుతోంది.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం
ఎమ్మెల్సీగా దండె విఠల్‌ ఎన్నికల చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ లీగల్‌ టీమ్‌తో చర్చలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టులో కూడా సవాల్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. న్యాయస్థానంపై నమ్మకం కోల్పోయిందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. మొన్న ఎన్నికల సంఘం, ఇప్పుడు న్యాయస్థానంలో తమకు న్యాయం జరగడం లేదని వాదిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ తీర్పు కూడా కలకలం రేపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News