United States: అమెరికాలో అరాచకాలు.. భారత సంతతి యువకుడిపై అమానుష దాడి.. వైరల్ గా మారిన వీడియో..

Crime News: చికాగోలు దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన యువకుడిపై ముగ్గురు దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన అతగాడు కాపాడండి అంటూ పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Last Updated : Feb 7, 2024, 02:11 PM IST
  • - భారతీయ విద్యార్థిపై మూకుమ్మడి దుండగుల దాడి..
    - కాపాలడంటూ పరుగులు పెట్టిన యువకుడు..
United States: అమెరికాలో అరాచకాలు.. భారత సంతతి యువకుడిపై అమానుష దాడి.. వైరల్ గా మారిన వీడియో..

Indian Student Bleeds Profusely In Video: అమెరికాలో ఉంటున్న భారతీయులపై వరుసగా దాడులు జరిగిన ఘటనలు సంచలనంగా మారాయి. ఈ ఏడాది నుంచి ఇప్పటిదాక నలుగురు భారతీయ విద్యార్థులు అనుమానస్పదంగా చనిపోయిన ఘటన మరువక ముందే మరో దారుణం సంభవించింది. దీంతో అగ్రరాజ్యంలో అమెరికాలో  ఏం జరుగుతుందన్న టెన్షన్ అందరిలోను నెలకొంది. ఈ ఘటనలో.. భారత్ సంతతికి చెందిన హైదరాబాద్ లంగర్ హౌస్ కు చెందిన సయ్యద్ హజాహిర్ అలీ పై మంగళవారం జరిగింది.

 

హోటల్ నుంచి తన ఇంటికి వెళ్తుండగా ఒక్కసారిగా ముగ్గురు ఆగంతకులు అతనిపై దాడికి పాల్పడ్డారు. అతని శరీరంపై పదునైన ఆయుధాలతో ఇష్టమోచ్చినట్లు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే అతను ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టాడు. అయిన కూడా అతడిని వాళ్లు వదిలిపెట్టలేదు. కాసేపువెంబడించినట్లు ఈ వీడియోలో రికార్డు అయ్యింది.  ఈక్రమంలో కాసేపటికి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటన గురించిన సదరు యువకుడు.. తన కుటుంబ సభ్యులకు తెలిపాడు.  ఆతర్వాత అక్కడున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు హజాహిర్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అతని భార్య సయ్యద్ రుకులియా ఫాతిమా రిజ్వి  విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. నా భర్త ఆరోగ్యం పట్ల చాలా ఆందోనగా ఉందని, తనకు ముగ్గురు మైనర్ పిల్లలున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

తన భర్తకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకొవాలన్నారు. తన భర్తను చూడటానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆమె కోరింది. అయితే.. మిస్టర్ అలీ కొన్ని నెలల క్రితమే..  ఇండియానా వెస్లియన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు వెళ్లినట్లు సమాచాం. 

Read More: Valentine's Day 2024: వాలెంటైన్స్ వీక్‌లో ఏయే కలర్ రోజ్‌లు ఎలాంటి అర్థాన్ని కలిగి ఉంటాయో తెలుసా?

ఈ ఏడాది అమెరికాలో జరిగిన ఘటనలు.. 

అమెరికన్ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న 19 ఏళ్ల విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ గత వారం చనిపోయినట్లు గుర్తించారు.  నీల్ ఆచార్య అనే మరో విద్యార్థి ఆ వారం ప్రారంభంలో పర్డ్యూ యూనివర్శిటీ క్యాంపస్‌లో చనిపోయాడని అతని తల్లి నివేదించిన కొన్ని గంటల తర్వాత కనుగొనబడింది. హర్యానాకు చెందిన 25 ఏళ్ల విద్యార్థి వివేక్ సైనీ జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో నిరాశ్రయులైన వ్యక్తి చేతిలో కొట్టి చంపబడ్డాడు. మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ వెలుపల శవమై కనిపించాడు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News