తొలిసారిగా మాస్క్ ధరించిన డొనాల్డ్ ట్రంప్

కరోనా మహమ్మారి అమెరికాలోనే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అధిక సంఖ్యలో జనాలను బలి తీసుకుంది. అయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లెక్క చేయలేదు. ఇప్పటివరకూ కనీసం ఒక్కసారి కూడా ఫేస్ మాస్క్ ధరించలేదు. కానీ మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో తొలిసారిగా ఫేస్ మాస్క్ ధరించి ట్రంప్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.

Last Updated : Jul 12, 2020, 11:37 AM IST
తొలిసారిగా మాస్క్ ధరించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త అవతారంలో కనిపించారు. అగ్రరాజ్యం అధినేత ట్రంప్ తొలిసారిగా మాస్క్ ధరించి (Donald Trump With Face Mask) దర్శనమిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు అమెరికాను వణికించింది. ముఖ్యంగా అమెరికాలోనే ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్19 పాజిటివ్ కేసులతో పాటు అధిక మరణాలు సంభవించాయి. మాస్కును ధరించాలని, వైద్య సిబ్బంది, అధికారులు హెచ్చరించినా అధ్యక్షుడు బేఖాతరు చేస్తూ వచ్చారు. భారత మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్

వాషింగ్టన్ డీసీలోని మిలిటరీ ఆసుపత్రిని అధక్షుడు ట్రంప్ సందర్శించారు. ఈ సందర్భంగా నలుపు రంగు మాస్క్ ధరించి వెళ్లారు. మిలిటరీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ సైనికులనూ ట్రంప్ పరామర్మించారు. తొలిసారిగా మాస్క్‌తో కనిపించిన ట్రంప్ అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

మాస్కును వ్యతిరేకించలేదు
తాను అసలు ఎప్పుడు ఫేస్ మాస్క్ వాడలేదని, అయితే వాడకానికి తానేమీ వ్యతిరేకిని కాదన్నారు అధ్యక్షుడు ట్రంప్. అయితే మాస్కును ఎక్కడ, ఎప్పుడు వాడాలో తెలుసుకుని వాడితే మంచిదని సూచించారు. ఆసుపత్రి లాంటి ప్రదేశాలలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మంచిదని అభిప్రాయపడ్డారు. చికిత్స పొందుతున్న సైనికులను హాస్పిటల్‌లో కలుసుకునే సందర్భంగా తాను ఫేస్ మాస్క్ (Donald Trump With Face Mask) ధరించానని వివరించారు.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News