Trump: బైడన్ ప్రమాణ స్వీకార సమయానికి ట్రంప్ వైట్‌హస్ వదలడా ?

White House | 2021లో అమెరికా అధ్యక్షుడు మారనున్నాడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరువాత డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షిల్ అభ్యర్థి జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. 

Last Updated : Dec 18, 2020, 07:20 PM IST
  • White House | 2021లో అమెరికా అధ్యక్షుడు మారనున్నాడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరువాత డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షిల్ అభ్యర్థి జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
Trump: బైడన్ ప్రమాణ స్వీకార సమయానికి ట్రంప్ వైట్‌హస్ వదలడా ?

Donald Trump | 2021లో అమెరికా అధ్యక్షుడు మారనున్నాడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరువాత డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షిల్ అభ్యర్థి జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అయితే ఈ సమయానికి ట్రంప్ వైట్ హౌజ్ వదిలి వెళ్లేలా లేడు అనే విధంగా వార్తలు వస్తున్నాయి. ట్రంప్ దీనికి నిరాకరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

అయితే ట్రంప్ (Donald Trump) మొండి పట్టుతో వైట్‌హస్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంటే అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఎలా వ్యవహరించాలి అనే అంశంపై అమెరికా నిపుణులు తపట్టుకుంటున్నారట. అమెరికా కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా జో బైడెన్, కమలాహ్యారిస్ జనవరి 20,2021లో ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Also Read | 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట

నవంబర్ 3న జరిగిన ఎన్నికల తరువాత జో బైడెన్ (Joe Biden) గెలుపు సాధించినప్పటి నుంచి డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ వదిలిపెట్టేదు లేదు అన్నట్టుగా ప్రకటన చేస్తూనే ఉన్నాడు. అంతే కాకుండా బైడెన్ గెలుపును స్వీకరించేది లేదన్నాడు. ఆ తరువాత కాస్త వెనక్కి తగ్గినా ఇప్పుడు వైట్‌హౌజ్‌ వదలను అన్నట్టుగా ప్రవర్తిస్తోండటంతో ఏం జరుగుతుందో అనేది వేచి చూస్తే గానీ తెలియదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News