US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదుగురు మృతి

America Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబసభ్యులు ఐదుగురు మరణించారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా టెక్సాస్ బంధువుల ఇంటికి వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 07:06 PM IST
US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదుగురు మృతి

America Road Accident: ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలోని టెక్సాస్‌లో ట్రక్కు ఢీకొని ట్రక్ ఢీకొని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఐదుగురు దుర్మరణం చెందారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్నా, చిన్నమ్మ, వాళ్ల కుమార్తె , మనవడు, మనవరాలు రోడ్డు ప్రమాదం ప్రాణాలు కోల్పోయారు. పొన్నాడ నాగేశ్వరరావు (68), చిన్నమ్మ సీతా మహాలక్ష్మి (65), కుమార్తె నవీన (38), మనవడు కృతిక్ (11), మనవరాలు నిషిధ (9) మరణించారు. అమలాపురంలో నివాసముంటున్న ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్నా కుటుంబం.. రెండు నెలల క్రితం అమెరికాలో కూతురు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 

మంగళవారం జాన్సన్ కౌంటీలోని హైవేపై ట్రక్కు-కారు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.. ప్రాణాలతో బయటపడిన నాగేశ్వరరావు అల్లుడు లోకేష్‌కు గాయాలు కాగా.. ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రక్కులో ఉన్న ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.

క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఎమ్మెల్యే బాబాయ్ కుటుంబం టెక్సాస్‌లోని కొంతమంది బంధువులను సందర్శించి ఇంటికి తిరిగి వస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వీరి కారును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులతో వెళ్తున్న లారీ.. రాంగ్ రూట్‌లో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. ట్రక్కు తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసు అధికారులు ధృవీకరించారని వెల్లడించారు. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News