Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Apr 21, 2024, 09:24 PM IST
  • నర్సాపురంలో సజ్జలపై ఫైర్ అయిన జనసేనాని..
  • ఒళ్లుదగ్గర పెట్టుకొవాలంటూ వార్నింగ్..
Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

Janasena Pawan Kalyan Fires On YSRCP Sajjalarama Krishna reddy: నా అన్న చిరంజీవి ఒక అజాత శత్రువు అని,ఆయన కాంగ్రెస్ లో ఉంటారో  లేదా తమ పార్టీకీ మద్దతు తెలుపుతారో ఆయన ఇష్టమని అన్నారు. గతంలో తన అన్న వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సొంత తమ్ముడినైన తాను ఒక్కమాట మాట్లాడలేదని పవన్ కళ్యాణ్  గుర్తు చేశారు. తన అన్న చిరంజీవి జోలికి,  రాష్ట్ర ప్రజల జోలికి వస్తే బాగుండదంటూ నరసాపురం పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ సజ్జలను ఏకీపారేశారు. వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సింహాం సింగిల్ గా వస్తుందంటున్న సీఎం జగన్, తోడెళ్లు, గుంటనక్కల బ్యాచ్ అంటూ పవన్ విమర్శించారు. గత ఎన్నికలలో రెండు స్థానాలలో ఓడిపోయిన కూడా, ప్రజల కోసం నిలబడ్డానంటూ వ్యాఖ్యలు చేశారు.

Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..

ఏపీ డెవలప్ మెంట్ కావాలనే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పాడ్డాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాకారంలేకుంటే రాష్ట్రాలు డెవలప్ అవ్వవని పవన్ అన్నారు. తాము అధికారంలోకి రాగేనే రాజధాని నిర్మాణం చేస్తామని, పోలవరం ప్రాజెక్టును వెంటనేపూర్తి చేస్తామన్నారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేస్తామన్నారు. వైఎస్ జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడని, పథకాల పేరుతో ప్రజను మభ్యపెడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకిరాగానే అన్ని వర్గాల ప్రజలను, ఉపాధి కల్పిస్తూ, ఆర్థికంగా కుంగుబాటుకు గురవ్వకుండా ఆదుకుంటామని పవన్ భరోసా ఇచ్చారు.

Read More: Snakes Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు నాగుపాముల్ని నోటితో పట్టుకున్న కింగ్ కోబ్రా..

ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ జగన్ కూడా తనదైన స్టైల్ లో పబ్లిక్ మీటింగ్ లో టీడీపీ, జనసేన, బీజేపీలపై  విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ను అపోసిషన్ నేతలు బచ్చా అంటున్నారని అన్నారు. ఈ బచ్చా చేతిలోనే.. గతంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు.ఈ బచ్చాను ఓడించడానికి మూడు పార్టీలు ఒక్కటై ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాయంటూ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోయే కాలం వస్తే,అవతలి వారు బచ్చాలా మాదిరిగానే కన్పిస్తారంటూ సీఎం జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News