AP Land titling Act : ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవేనా.. ? వైసీపీ చెబుతోంది ఇదే.. ? Part -2

AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 7, 2024, 12:33 PM IST
AP Land titling Act : ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవేనా.. ? వైసీపీ చెబుతోంది ఇదే.. ? Part -2

AP Land titling Act: బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డులు అన్ని అస్తవ్యస్త్యంగా ఉన్నాయి. అందులో సరైనవి లేకపోవడంతో వాటిని అమ్మాలన్నా.. కొనాలన్నా.. ఏ అవసరమో వచ్చి ఇతరులకు విక్రయించాలన్న ప్రజలు అనేక ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తోంది. వివాదంలో ఉన్న భూములపై పోరాడుతున్న వారికీ ఈ కష్టాలు మరింత ఇబ్బందికరంగా మారాయి.

ఇపుడున్న భూ రికార్డులే కొనసాగితే.. ?

ఇపుడున్న భూ రికార్డులు కొనసాగితే.. తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు అస్సలు పరిష్కారం దొరకదు. వారసత్వంగా కొంత మంది తమకున్న ఈ వివాదాస్పద భూములనే తమ వారసులకు అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలైతే.. భూములపై సమగ్ర సర్వే నిర్వహించి ..దానికి అసలసిసలు యాజమానులెవరో తేల్చి.. వారికీ భూమిపై శాశ్వత హక్కులను కల్పించడమే లాండ్ టైటిల్ యాక్ట్ ముఖ్య ఉద్దేశ్యం.దీంతో వివాదాస్పదం కానీ భూములపై ప్రజలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తారు. ఇలా అన్ని రకాలుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అతిపెద్ద భూ సంస్కరణగా నిలివబోతుంది.

అసలు మన దగ్గర భూ వివాదాల విషయమై ప్రజలు.. ఎన్నో ఏళ్లుగా రెవెవ్యూ ఆఫీసుల చుట్టూ.. కోర్టుల చుట్టూ ఎన్నో ఏళ్లుగా చెప్పులు అరిగిపోయేలా తిరిగినా.. పనులు మాత్రం కావు. వివాదాస్పద భూములైతే దానిపై హక్కుల కోసం ఆయా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. దీనికి అంతటికీ కారణంగా అప్పట్లో బ్రిటిష్ వారు చేపట్టిన సమగ్ర భూ సర్వే ఆధారంగానే రికార్డులు ఉండటం.. అందులో కొన్ని తప్పులు ఉండటం కూడా  ఈ సమస్యలన్నింటికీ మూలం.
        
మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా.. ఇంకా అప్పటి తెల్లదొరలు చేసిన సర్వేలు మీద ఆధారాపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించలేదు. దీంతో అసలైన భూ యజమానులు ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తున్నారు. అందుకే ఏపీలో సీఎం జగన్ సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. దాని ఆధారంగానే ల్యాండ్ టైటల్ యాక్ట్ పూర్తి స్తాయిలో అమల్లోకి రాబోతుంది. భూ యజమానులకు శాశ్వత హక్కుల లభించినట్టు అవుతోంది. వివాదంలో ఉన్న భూములకు పరిష్కారం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ యాక్ట్ వల్ల ప్రయోజనాలు..

ప్రజల భూముల భద్రతకు గవర్నమెంటే జవాబుదారి. ఎలాంటి లిటికేషన్స్ లేని భూములు ప్రతి ఒక్కరి దగ్గరా ఉండటం. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కలిగే విస్తృత ప్రయోజనాలని చెబుతున్నారు. ఏపీలో ముసాయిదా చట్టం అమల్లో ఉంది. దీనివల్ల భూములపై సమగ్ర సర్వే జరగుతోంది. ఈ సర్వేను సర్వే ఆఫ్ ఇండియా ప్రశంసలు కురిపిస్తోంది. చిన్న చిన్న భూ సమస్యలను మొబైల్ కోర్టుల్లోనే పరిష్కరిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 17 వేల గ్రామాలున్నాయి. అందులో 4 వేల గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఇంకా రెండు వేల గ్రామాల్లో చివరి అంకానికి ఈ సర్వే చేరింది. ఇంకా 11 వేల గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉంది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయ్యాకా.. ముందుగా ఎలాంటి వివాదం లేని భూముల యజమానులకు శాశ్వత హక్కులలను కల్పిస్తూ పత్రాలను అందజేస్తారు. భూ యజామానులు ఎవరు ఇకపై కోర్టులకు పోవాల్సిన అవసరమే ఉండదు.  

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News