TOP EV Cars: చిన్న చిన్న గల్లీల్లో సులభంగా తిరగగలిగే టాప్ 4 ఈవీ కార్లు ఇవే

TOP EV Cars: కార్లలో ప్రయాణం సౌకర్యంగానే ఉంటుంది గానీ రద్దీగా ఉండే నగరాల్లో కార్లలో తిరగడం అంటే నరకయాతనే. పెద్ద పెద్ద సెడాన్ లేదా ఎస్‌యూవీ కార్లు అంత సులభంగా తిరగలేవు. చిన్న చిన్న కార్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ నాలుగు కార్లు బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 9, 2024, 02:19 PM IST
TOP EV Cars: చిన్న చిన్న గల్లీల్లో సులభంగా తిరగగలిగే టాప్ 4 ఈవీ కార్లు ఇవే

TOP EV Cars: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ నడుస్తోంది. దాదాపు అన్ని కార్ల కంపెనీలు ఈవీ కార్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి. రద్దీగా ఉండే నగరాల్లో సులభంగా తీరిగేందుకు వీలుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ చిన్న కార్లు కూడా వచ్చేశాయి. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో ఉన్న నాలుగు బ్రాండెడ్ చిన్న ఈవీ కార్ల గురించి తెలుసుకుందాం. 

సిట్రాయెన్ ఈసీ 3..కేవంల 12.69 లక్షలతో ప్రారంభమౌతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు లుక్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కారు బ్యాటరీ కెపాసిటీ 29.2 కిలోవాట్స్. జర్నీ సుఖంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే ఇదే మంచి ఆప్షన్. 80 శాతం ఛార్జ్ అవడానికి కేవలం 57 నిమిషాల సమయం తీసుకుంటుంది.

ఎంజి కోమెట్...మార్కెట్‌లో ఉన్న అత్యంత చిన్నదైన తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే. చూడ్డానికి బుల్లి కారులా ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో మొత్తం 5 వేరియంట్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఎఫ్‌సి, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సి మోడల్స్ ఉన్నాయి. పరిమాణంలో చాలా చిన్నది కావడంతో ఇరుకైన సందుల్లో కూడా వెళ్లిపోతుంది. బయట్నించి చిన్నదిగా అన్పించినా లోపల స్పేసియస్‌గా ఉంటుంది. చిన్నది కావడంతో పార్కింగ్ కూడా ఈజీగా ఉంటుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 

టాటా టియోగో ఈవీ...ఈ కారు ధర 7.99 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇదొక కాంపాక్ట్ అండ్ స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ కారు. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు ఫ్రంట్ గ్రిల్ ఆకర్షణీయంగా ఉంటుంది. కేవలం 5.7 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఇందులో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లు కూడా ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీ..ఇదొక మిడ్ సైజ్ ఎస్‌యూవీ. ఈ కారు ప్రారంభ ధర 10.99 లక్షల రూపాయలు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఇందులో ఈకో, సిటీ స్పోర్ట్ వంటి మోడల్స్ ఉన్నాయి. 

Also read: Bajaj Pulsar NS400Z: గంటకు 154 కిలోమీటర్ల వేగంతో కొత్త పల్సార్ బైక్, ధర ఫీచర్లు ఇలా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News