#NTRforSDT : మెగా హీరో సినిమాను ప్రమోట్ చేస్తున్న జూ.ఎన్టీఆర్.. ఆయన కోసమేనా?

Jr NTR Voice for the Title Glimpse of SDT 15: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోసం తన హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో అనుకుంటున్నారా? దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 5, 2022, 05:44 PM IST
#NTRforSDT : మెగా హీరో సినిమాను ప్రమోట్ చేస్తున్న జూ.ఎన్టీఆర్.. ఆయన కోసమేనా?

Jr NTR Promoting Mega Hero Sai Dharam Tej Movie: రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచులు చివరిదాకా వెళ్లి మళ్లీ కోలుకున్న సాయి ధరంతేజ్ తన 15వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాంతార ఫేమ్  అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద బివీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఏడో తేదీ ఉదయం 11 గంటలకు ఈ టైటిల్ గేమ్స్ రిలీజ్ చేయబోతూ ఉండగా దానికి అదనపు హంగులను జోడిస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేత వాయిస్ ఓవర్ ఇప్పించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేసింది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అఫీషియల్ ట్విట్టర్ పేజీ టైటిల్ గ్లింప్స్ కి వాయిస్ అందించినందుకు జూనియర్ ఎన్టీఆర్ కి థాంక్స్ చెబుతూ ఒక ట్రిబ్యూట్ లాంటి వీడియో రిలీజ్ చేశారు. 29 సెకండ్ల పాటు సాగుతున్న ఈ వీడియోలో ఆర్ఆర్ఆర్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ప్లే చేయడమే కాక ఈ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండమని ఫాన్స్ కు ఒక్కసారిగా ఆసక్తి పెంచేశారు.

ఒక మెగా హీరోకి నందమూరి హీరో సపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సాయి ధరంతేజ్ మెగా హీరో అన్న పేరే కానీ అందరూ హీరోలతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు, దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తూ ఉండడంతో ఆయన అభ్యర్థన మేరకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Also Read: Man Chops breasts: మహిళతో ఇల్లీగల్ అఫైర్.. దూరం పెట్టిందని రొమ్ములు కోసేశాడు!

Also Read: Rithu Chowdary: అందాల ప్రదర్శనతో రీతూ చౌదరి రచ్చ.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News