Katrina Kaif Honeymoon: మాల్దీవ్స్‌లో హనీమూన్‌.. హాట్ ఫొటోలు షేర్ చేసిన కత్రినా కైఫ్!!

Katrina Kaif Honeymoon: హనీమూన్‌ కోసం మాల్దీవ్స్‌ చెక్కేసిన విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ జంట.. ప్రస్తుతం అక్కడ ఎంజాయ్ చేస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 04:33 PM IST
  • ఏడడుగుల బంధంతో ఒక్కటైన విక్ట్రీనా
  • మాల్దీవ్స్‌లో హనీమూన్‌
  • హాట్ ఫొటోలు షేర్ చేసిన కత్రినా కైఫ్
Katrina Kaif Honeymoon: మాల్దీవ్స్‌లో హనీమూన్‌.. హాట్ ఫొటోలు షేర్ చేసిన కత్రినా కైఫ్!!

Katrina Kaif Honeymoon Photos Goes Viral: బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్‌ (Vicky Kaushal), కత్రినా కైఫ్‌  (Katrina Kaif) గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబర్‌ 9న రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ కోటలో ఏడడుగుల బంధంతో విక్ట్రీనా జంట ఒక్కటైంది. ప్రేమ ముచ్చట్ల నుంచి పెళ్లి హడావుడి వరకు ఈ ఇద్దరి స్టార్లకు సంబంధించిన వార్తలు బీటౌన్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హైలైట్‌ అయ్యాయి. 

విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ తమ హనీమూన్‌ (Katrina Kaif Honeymoon)ను మాల్దీవుల్లో ప్లాన్‌ చేశారు. నూతన సంవత్సరంకు ముందు మాల్దీవ్స్‌ (Maldives) చెక్కేసిన ఈ జంట.. ప్రస్తుతం అక్కడ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ పక్కన దిగిన పోటోలను సోమవారం కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 'మై హ్యాపీ ప్లేస్' అని కాప్షన్ ఇచ్చారు. ముదురు ఆకుపచ్చ టాప్ మరియు తెలుపు బీచ్‌వేర్‌లో కాట్ తన అందాలను ఆరబోశారు. 

Also Read: Actress Switzerland Vacation: ఈ నాజూకు నడుము ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

కత్రినా కైఫ్‌ హనీమూన్‌ ఫొటోలు వైరల్ అయ్యాయి. కాట్ ఫొటోలకు తెగ లైకులు, కెమెంట్లు వస్తున్నాయి. అయితే కత్రినా పోస్ట్ చేసిన చిత్రాలలో విక్కీ కౌశల్‌ లేకపోవడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'దయచేసి విక్కీతో ఉన్న పోటోలను పోస్ట్ చేయండి' అని ఒకరు కెమెంట్ చేయగా.. 'మిలియన్ హృదయాలను గెలిచిన రాణి' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 

Also Read: Ranga Ranga Vaibhavanga Teaser: 'రంగ రంగ వైభంగా'... ఎలా ఉంది? టీజర్ నిజంగానే నెక్ట్స్ లెవెల్!!

దాదాపు రెండేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత విక్కీ మరియు కత్రినా డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. 120 మంది అతిథుల మధ్య విక్ట్రీనా వివాహం జరిగింది. మాళవిక మోహనన్, నేహా ధూపియా, అంగద్ బేడీ, కబీర్ ఖాన్, మినీ మాథుర్, గురుదాస్ మాన్ మరియు శర్వరీ వాఘ్ వంటి ప్రముఖులు వీరి పెళ్లికి హాజరయ్యారు. కత్రినా గతంలో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News