Prabhas Slapped by Fan: ప్రభాస్‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఒక అభిమాని చెంప దెబ్బ కొట్టింది. అవును నిజమే.. డార్లింగ్ ప్రభాస్ ఎయిర్ పోర్టు నుంచి బయటకి వస్తుండగా.. అభిమాని ఫోటో దిగింది.. వెళ్లేప్పుడు చెంపపై కొట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2023, 03:38 PM IST
Prabhas Slapped by Fan: ప్రభాస్‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్

Prabhas Slapped by Fan: పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ అంటే దేశంలో ఎంతోమందికి ఇష్టం. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ను అభిమానించే వారు ఉన్నారు. 'బాహుబలి' సిరీస్ తర్వాత పాన్ వరల్డ్ స్థాయిలో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. మరీ ముఖ్యంగా జపాన్ దేశంలో 'బాహుబలి'కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు అనుకున్న మేర మెప్పించలేకపోయినా.. ఆయన క్రేజ్ మాత్రం జపాన్ లో తగ్గలేదు. 

తన ఫ్యాన్స్ ను ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అదే రేంజ్ ఆయన అభిమానులు కూడా డార్లింగ్ పై ప్రేమను కురిపిస్తారు. అడిగిన వారికీ సాయం కూడా చేస్తూ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. అందుకే ప్రభాస్ అంటే అభిమానులకు కూడా ఎనలేని ప్రేమాభిమానం. ఫ్యాన్స్ అడిగి అడగకముందే ఫొటోలు, ఆటోగ్రాఫ్ లు ఇచ్చే ప్రభాస్ కు తాజాగా ఓ ఫన్నీ సంఘటన ఎదురైంది. 

డార్లింగ్ ప్రభాస్ ఎయిర్ పోర్టు నుంచి బయటకి వస్తుండగా.. ఓ యువతి ఫొటో కోసం రిక్వస్ట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో 'సాహో' మూవీ షూటింగ్ నాటిది అని తెలిసింది. అయినప్పటికీ ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియోలో ప్రభాస్ ను ఫొటో అడిగిన ఓ అమ్మాయి.. అతనిపై అభిమానం, సంతోషం కలగలిపి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by telugutiktokofficial (@telugutiktok_official)

Also Read: Infinix Note 30 5G మొబైల్‌ను రూ. 1,190కే పొందండి..ఫీచర్లు, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు ఇవే..

అభిమాన నటుడితో ఫొటో దిగుతున్న అనంద క్షణంలో ప్రభాస్ చెంపపై ఆ అమ్మాయి ప్రేమగా కొట్టింది. వెంటనే ప్రభాస్ సిగ్గుతో తలదించుకున్నాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆమె ప్రవర్తన చూసి అక్కడ ఉన్నవారు అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ చిరునవ్వుతో సిగ్గు పడడం అభిమానులను కట్టిపడేసింది. 
ప్రభాస్ కొత్త సినిమాలు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మొదటిది సలార్.. ఈ ఏడాది డిసెంబరు 22న విడుదలకు సిద్ధమయ్యింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి తెరకెక్కిస్తున్న 'కల్కి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది అనగా 2024లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ కూడా సిద్ధం కాబోతోంది.

Also Read: Flipkart Big Billion Days Sale 2023: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News