Neethone Nenu: అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న 'నీతోనే నేను'

'సినిమా బండి' ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా నటిస్తున్న సినిమా ‘నీతోనే నేను’. ఈ సినిమాలో కుషిత క‌ళ్ల‌పు, మోక్ష‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 13 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2023, 03:33 PM IST
Neethone Nenu: అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న 'నీతోనే నేను'

'సినిమా బండి' ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మరియు కుషిత క‌ళ్ల‌పు, మోక్ష‌ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నీతోనే నేను’. ఈ సినిమాని శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మాతగా వ్య్వవహరిస్తున్నారు. అక్టోబ‌ర్ 13న విడుదల అవనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మెద‌క్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు.ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ.. "నీతోనే నేను" కథను రాయటానికి డిసెంబర్ నుంచి మే వరకు టైం తీసుకున్నాను. కథ గురించి ప్రతి విషయం సినిమా టీమ్ తో చర్చిస్తూ.. వచ్చాం. మే లో కథ పూర్తీ అవగానే.. కేవలం 33 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తీ చేసాం. చేసుకున్న ప్రణాళిక ప్రకారం.. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాని పూర్తీ చేశాము. డైరెక్ట‌ర్ అంజి రామ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్‌, డాన్స్ మాస్ట‌ర్ అనీష్‌, కో డైరెక్ట‌ర్ కిర‌ణ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్‌గారు స‌హా అంద‌రికీ ధన్యవాదాలు. చాలా మంది ఎందుకు టీచర్లపై సినిమా..? మంచి కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నా కథ మీదా.. నా ఉపాధ్యాయుల మీద, నా టీమ్ మీద పూర్తి నమ్మకంతో ఈ సినిమా తెరకెక్కించాము. సినిమాని మా టీమ్ తో కలిసి చూసాం.. సినిమా చాలా బాగా వచ్చింది. పక్కా.. సక్సె అవుతుంది అని చిత్ర యూనిట్ చెప్పారు. ‘నీతోనే నేను’ సినిమాను చూసిన మెద‌క్ వాళ్లూ.. మా ప్రాంత‌వాసి చేసిన సినిమా అని గొప్ప‌గా చెప్పుకుంటారు. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. అక్టోబ‌ర్ 13న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం చేశాను" అని తెలిపారు. 

సినిమా ద‌ర్శ‌కుడు అంజిరామ్ మాట్లాడుతూ.. ‘మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపటం ఆనందంగా ఉంది. ఈ 4 నెలలు సినిమా టీమ్ కస్టపడి పూర్తీ చేశాము. అందువ‌ల్లే సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యాం. మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్‌గారు, మా సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ రెడ్డిగారు అందించిన సహాకారం గురించి ఎంత చెప్పినా తక్కువే.. నటీనటులు హీరో వికాస్ వశిష్ట‌, కుషిత క‌ళ్ల‌పు, మోక్ష‌, ఆకెళ్ల స‌హా  అంద‌రూ బాగా న‌టించారు. ఇక నిర్మాత సుధాక‌ర్ రెడ్డిగారు.. మా వెనుకుండి ముందుకు న‌డిపించారు. ఇండ‌స్ట్రీలోకి కొత్త‌గా అడుగు పెట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న డేడికేష‌న్, క‌మిట్‌మెంట్‌తో సినిమాను కంప్లీట్ చేశారు. ఆయ‌న అందించిన స‌పోర్ట్‌కి ధ‌న్య‌వాదాలు. కిర‌ణ్‌గారికి, తేజ‌గారికి, ఎడిట‌ర్ ప్ర‌తాప్ స‌హా టీమ్‌కి థాంక్స్‌’’ అన్నారు. 

Also Read: PM Kisan Status: రైతులకు శుభవార్త.. రూ.8 వేలకు పెంచనున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి..!  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఎమ్‌.ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సమాజాన్ని గొప్పగా తీర్చి దిద్దే టీచర్స్‌కి సంబంధించిన క‌థతో ‘నీతోనే నేను’ సినిమా చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ స‌భ్యులు కూడా మూవీని అప్రిషియేట్ చేశారు. అక్టోబ‌ర్ 13న మూవీని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. 

న‌టీనటులు: వికాస్ వ‌శిష్ట‌, మోక్ష‌, కుషిత, అకెళ్ల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌:  శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత‌:  ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.ప్రభాకర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: అంజిరామ్‌
సంగీతం:  కార్తీక్ బి.క‌డ‌గండ్ల‌
సినిమాటోగ్రాఫ‌ర్‌:  ముర‌ళీ మోహ‌న్

Also Read: IND Vs AFG Dream11 Prediction Today Match: ఆఫ్ఘన్‌తో భారత్ పోరు.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News