Nindha Movie Poster: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ కొత్త మూవీ.. ఆసక్తికరంగా నింద మూవీ పోస్టర్

Varun Sandesh Nindha Movie: వరుణ్ సందేశ్ హీరోగా రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ నింద. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2024, 11:15 PM IST
Nindha Movie Poster: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ కొత్త మూవీ.. ఆసక్తికరంగా నింద మూవీ పోస్టర్

Varun Sandesh Nindha Movie: వరుణ్‌ సందేశ్ వరుస సినిమా ప్రకటనలతో జోరు పెంచారు. ఇప్పటికే రెండు సినిమాలు ప్రకటించిన వరుణ్‌.. తాజాగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా సరికొత్త కాన్సెప్ట్‌తో నింద అనే సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాను ప్రకటిస్తూ.. టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజేష్ జగన్నాథం ఈ సినిమాకు కథ, కథనాన్ని రాసి.. దర్శకత్వం వహిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్నారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నింద టైటిల్‌ను ఫిక్స్ చేసి.. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌ ఇచ్చారు.

Also Read: Salaar: ఇలా చేస్తే చాలు.. సలార్ లోని ప్రభాస్ బైక్ ఇక మీ సొంతం

పోస్టర్ విషయానికి వస్తే.. ఎవరో చేసిన తప్పుకు మరొకరు నింద ఎదుర్కొంటున్నట్లు మెయింట్ పాయింట్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఊరి వాతావరణం.. గుడిసె, పొలాల మధ్యన ఓ వ్యక్తి కత్తి పట్టుకుని ఉండడం.. దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్న న్యాయదేవత విగ్రహం కూడా ఉంది. పోస్టర్‌తోనే సినిమాపై ఎంతో ఆసక్తి క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులకు చూపించగా.. వారంతా సినిమాను మెచ్చుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు. 

ఇక త్వరలోనే ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సంతు ఓంకార్ మ్యూజిక్ అందిస్తుండగా.. కెమెరామెన్‌గా రమీజ్ నవీత్ పనిచేస్తున్నారు. ఎడిటర్‌గా అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు.   

వరుణ్ సందేశ్ చాలా ఏళ్లుగా ఓ సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కెరీర్ ఆరంభంలో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో ఇండస్ట్రీలోకి దూసుకువచ్చారు. అయితే ఆ తరువాత వరుణ్‌ ఖాతాలో సరైన హిట్ పడలేదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి తన భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. ఆ తరువాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా ప్రకటించిన నింద మూవీతోపాటు వరుణ్ సినిమాలు మరో రెండు క్యూలో ఉన్నాయి. ఒక్క సరైన హిట్ పడితే మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వచ్చని ఎదురు చూస్తున్నారు.

Also Read: Weight loss Tips: ఈ 6 కూరగాయల్లో నీరు అధికం.. ఇలా తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News