Chia seeds Turmeric water benefits: చీయాసీడ్స్‌, పసుపునీటిని పరగడుపున తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..

Chia seeds Turmeric water benefits ప్రతిరోజు ఉదయం పసుపు నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఒక చిటికెడు పసుపును కూడా నోట్లో వేసుకుంటే హెల్త్ ఎంత బాగుంటుందని, వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని ఉదయమే తాగితే మంచిదని చెబుతారు.

Written by - Renuka Godugu | Last Updated : May 8, 2024, 07:02 PM IST
Chia seeds Turmeric water benefits: చీయాసీడ్స్‌, పసుపునీటిని పరగడుపున తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..

Chia seeds Turmeric water benefits:  ప్రతిరోజు ఉదయం పసుపు నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఒక చిటికెడు పసుపును కూడా నోట్లో వేసుకుంటే హెల్త్ ఎంత బాగుంటుందని, వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకొని ఉదయమే తాగితే మంచిదని చెబుతారు. అయితే చియా సీడ్స్ కలిపి పసుపు నీళ్లను తాగితే మరింత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్..
చియా సీడ్స్ వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మంచి కొవ్వులు ఇన్ల్ఫమేషన్ సమస్యను తగ్గిస్తాయి. చీయాసీడ్స పసుపునీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు కూడా తగ్గిపోతారు. నానబెట్టిన చియా సీడ్స్ పసుపునిటిలో వేసుకొని కలిపి తాగితే శరీరంలో ఇన్ల్ఫమేషన్ సమస్య తగ్గిపోతుంది.

బ్లడ్ షుగర్..
పసుపు నీటిలో చియాసిడ్ నానబెట్టుకుని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నిర్వహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వకుండా సహాయపడుతుంది. సహజసిద్ధమైన ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. ఇది అతిగా తినడాన్ని నివారించి బరువు పెరగకుండా కాపాడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది యాంటీఇన్ల్ఫమేటరీ గుణాలు వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. ఒబేసిటీ రాకుండా మెటమాలిక్ డిసార్డర్ తో సమస్యలు రాకుండా చేస్తుంది. బరువు పెరగకుండా ఉండటానికి ఈ డ్రింక్ తీసుకోవచ్చు.

జీర్ణ ఆరోగ్యం..
చియా సీడ్స్ ను పసుపు నీటిలో నానబెట్టి తీసుకో ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీంతో జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది.

ఇదీ చదవండి:  బ్రౌన్ బ్రెడ్‌ తింటే మీ శరీరానికి 7 ఆరోగ్య ప్రయోజనాలు..

మెటబాలిజం..
కొన్ని నివేదికల ప్రకారం చీయాసీడ్స్, పసుపు మెటబాలిజం రేటును పెంచుతుంది శరీరంలోని చెడు కొవ్వును కరిగించడానికి ప్రోత్సహిస్తుంది. పసుపు నీటిలో చియా సీడ్స్ నానబెట్టి డైట్ లో చేర్చుకోవాలి. చియా సీడ్స్ నీటిలో నానబెట్టిన తర్వాత అది జెల్ రూపంలోకి మారుతుంది ఇది మంచి రిఫ్రెషనింగ్‌ ఇస్తుంది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
చియా సీడ్స్ లో క్యాల్షియం మెగ్నీషియం ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఏ అవసరమైన ఖనిజాలు మన ఎముక ఆరోగ్యానికి ఎంతో అవసరం ఆస్టియోపోరాసిస్ రాకుండా నివారిస్తుంది చియా సీడ్స్ లో గ్లూటెన్ ఫ్రీ.

ఇదీ చదవండి: అవిసెగింజలను మీ డైట్లో చేర్చుకుంటే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు..

పసుపు చియా సీడ్స్ కలిపి నీటిని తయారు చేసుకునే విధానం..
చియా సీడ్స్ -2 tbsp 
పచ్చి పసుపు- ఒక చిన్న ముక్క
నీళ్లు-3 కప్పులు
తేనే లేదా నిమ్మరసం

రెండు టేబుల్ స్పూన్స్ చీయా సీడ్స్‌నానబెట్టి పెట్టు కోవాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి నీటిని వేడి చేస్తూ ఉండాలి. ఒక 15 నిమిషాల తర్వాత నానబెట్టిన చీయాసీడ్స్ జెల్ రూపంలోకి మారుతుంది.పసుపును కడిగి దాని తొక్కను తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తీసుకొని వేడి నీటిని పోసుకొని అందులో పసుపు చియా సీడ్స్ వేసి బాగా కలుపుకోవాలి రుచి కోసం తేనె లేదా నిమ్మరసం పిండుకొని తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News