Uses Of Sandalwood Powder In Summer: తెల్లగంధం చెట్టు ఆయుర్వేద ములిక. దీని వల్ల ఆరోగ్యనికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శీతల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల కఫం, అలసట, విషాలు, దాహం, రక్తపైత్యం వంటి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. వేపవిలో కలిగే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఈ తెల్లగంధం లేద చందన చూర్ణం వల్ల కలిగే మరి కొన్ని లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
గంధం చెక్క కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:
తెల్లగంధం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మంచి నాణ్యత గల చెందనం అధిక తుమ్ముల సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా మంచిగంధం పొడి హారతి కర్పూరం సమంగా కలిపి మంచినీటితో మెత్తగా నూరి బొడ్డుపై లేపనం చేస్తే కడుపు నొప్పి, నీళ్ల విరేచనాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ తెల్లగంధం చర్మ వ్యాధులును తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా ఎర్రచందనం, మంజిష్ట, లొద్దుగచెక్క, చంగల్వకోస్టు, మర్రిచిగుర్లు, నల్లపెసలు సమంగా కలిపి నీటితో మెత్తగా నూరి బొల్లి మచ్చలపై రాస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి.
మూత్రం సరిగ్గా రాకపోతే, 3 గ్రాముల చందనచూర్ణం, 3 గ్రాముల చక్కెర కలిపి ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో సేవిస్తే మూత్రం సాఫీగా పడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ముఖం కాంతివంతంగా కనిపించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. పాలలో గంధాన్ని కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం అందంగా కనిపిస్తుంది. స్నానం చేసే నీటిలో గంధం నూనె ఐదు నుంచి ఆరు చుక్కలు వేసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే రోజ్ వాటర్‌లో గంధం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై మొటిమలు తగ్గుతాయి.
ఈ చందన చూర్ణం జుట్టు రాలడాన్ని నివారించడానికి, తలపై పేనులను చంపడానికి సహాయపడుతుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. చందన చూర్ణం హెయిర్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఇది జుట్టును బలోపేతం చేస్తుంది. పోషణను అందిస్తుంది. దీంతో పాటు చందన చూర్ణం ఒక సువాసన ద్రవ్యంగా ఉపయోగించవచ్చు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చందన చూర్ణం జ్వరం, తలనొప్పికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
చందన చూర్ణం ఎలా వాడాలి:
చందన చూర్ణాన్ని నీటితో కలిపి పేస్ట్‌గా చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను మీ ముఖం, జుట్టు లేదా శరీరంలోని ఇతర ప్రాంతాలకు అప్లై చేయండి.
చందన చూర్ణాన్ని సబ్బులు, షాంపూలు మరియు క్రీములలో కూడా చేర్చవచ్చు.
చందన చూర్ణాన్ని నేరుగా మీ చర్మానికి అప్లై చేయవచ్చు, కానీ మీకు సున్నితమైన చర్మం ఉంటే, ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహా కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణులను సంప్రదించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి