Viral Video: పెళ్లి వేడుకలో గాల్లోకి కాల్పులు జరిపిన కొత్త జంట.. రంగంలోకి దిగిన పోలీసులు

Bride and Groom fire gun during wedding: పెళ్లి వేడుకలో పెళ్లి చేసుకోవాలి కానీ నూతన వరుడు, నూతన వధువు కలిసి గాల్లోకి కాల్పులు జరిపితే ఎలా ఉంటుందో చెప్పండి. అది కూడా సోషల్ మీడియాలో వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పనులు చేస్తే ఇంకేమైనా ఉందా ?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 06:15 PM IST
Viral Video: పెళ్లి వేడుకలో గాల్లోకి కాల్పులు జరిపిన కొత్త జంట.. రంగంలోకి దిగిన పోలీసులు

Bride and Groom fire gun during wedding: పెళ్లి వేడుకలో పెళ్లి చేసుకోవాలి కానీ నూతన వరుడు, నూతన వధువు కలిసి గాల్లోకి కాల్పులు జరిపితే ఎలా ఉంటుందో చెప్పండి. అది కూడా సోషల్ మీడియాలో వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పనులు చేస్తే ఇంకేమైనా ఉందా ? ఆ శబ్ధం వినడం వల్ల కానీ లేదా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవడం వల్ల కానీ పోలీసులు వాళ్లను వెతుక్కుంటూ రావడం గ్యారెంటీ కదా. ఇదిగో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న ఈ గన్ ఫైరింగ్ వీడియోకు (Gun firing viral video) సంబంధించిన ఘటన విషయంలో కూడా అదే జరిగింది. 

ఎవరైనా పెళ్లి వేడుక అనేది అంగరంగ వైభవంగా జరగాలనే కోరుకుంటారు. ఇంకొంత మంది అంగరంగ వైభవంగా పెళ్లి జరగడంతో పాటు నలుగురు తమ గురించి చెప్పుకునేలా వెరైటీగా (Variety weddings) చేసుకోవాలని భావిస్తారు. అలా నలుగురి కంట్లో పడటం కోసం, నలుగురి మెప్పు పొందడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా లేనిపోని చిక్కులు, సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. అలాంటి ఘటనే ఇది కూడా. 

Also read : Google Warning: మీ స్మార్ట్‌ఫోన్లలో ఆ 8 యాప్‌లు ఉన్నాయా...వెంటనే తొలగించండి

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలోని కొత్వాలిలో గత ఆదివారం జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడు, వధువు కలిసి గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు (Bride and Groom firing gun) జరిపారు. వరుడు తుపాకీ కాల్చుతుండగా వధువు అతడిని ప్రోత్సహిస్తున్నట్టుగా నవ్వుతూ అతడి చేయి పట్టుకుంది. వధువు, వరుడు ఇద్దరూ కలిసి గాల్లోకి కాల్పులు జరుపుతుండగా ఆ పెళ్లికి వచ్చిన అతిథులు వారిని చప్పట్లు, విజిల్స్‌తో ప్రోత్సహించారు.

Also read : Video: ముద్దుల్లో మునిగితేలుతున్న కోతులు.. తల్లి కోతి నిద్ర చెడకుండా పిల్ల కోతి ఆరాటం

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో అది కాస్తా ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల కంట పడింది. ఇంకేం.. సెలబ్రేటరీ ఫైరింగ్ (Celebratory firing) నేరమే అవుతుంది కనుక ఆ జంటను వెతికే పనిలో పోలీసులు బిజీ అయ్యారు. ఎలాగైనా సరే ఆ కొత్త జంటపై కేసు నమోదు చేసి వారికి శిక్షపడేలా చేయాలని యూపీ పోలీసులు తిరుగుతున్నారు. ఎలాగూ అడ్రస్ తెలిసింది. డేట్ తెలిసింది కనుక ఆ జంట ఎవ్వరో తెలుసుకోవడం కూడా పెద్ద కష్టమైన పనేం కాదు.

Also read : Shocking videos: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News