Ayodhya: అయోధ్య బాల రాముడికి 7 కిలోల బంగారు రామాయణం బహుమతి..

Ayodhya: అయోధ్యలో  ఈ యేడాది జనవరి 22న భవ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. దాదాపు 500 యేళ్ల తర్వాత అయోధ్య కొలువైన బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. తాజాగా ఓ భక్తుడు రూ. కోట్ల విలువైన 7 కిలోల బంగారు రామాయణాన్ని బహుమతిగా ఇచ్చాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2024, 08:50 AM IST
Ayodhya: అయోధ్య బాల రాముడికి 7 కిలోల బంగారు రామాయణం బహుమతి..

Ayodhya: ఉత్తర ప్రదేశ్‌లో కొలువైన అయోధ్య బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. అంతేకాదు అయోధ్య రాముడికి అదే రీతిలో కానుకలు వస్తున్నాయి. తాజాగా రాముడికి ఓ భక్తుడు రూ. కోట్ల విలువ చేసే ఏడు కిలోల బంగారంపై రాసిన రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధాన గర్భాలయంలో ఉంచారు.  అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ తన జీవిత కాలంలో సంపాదించిన మొత్తాన్ని బాల రాముడికి ఇస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసారు. ఆ మాట ప్రకారం రూ. 5 కోట్లు ఖర్చుతో 151 కిలోల బరువున్న రామచరిత రామాయణాన్ని తయారు చేశారు.  10, 902 శ్లోకాలతో ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. మరోవైపు ఈ బంగారు రామాయణ తయారీలో దాదాపు 140 కిలోల రాగిని వినియోగించారు. మరోవైపు రామమందిరంలో కలశ స్థాపనతో 9 రోజుల పాటు శ్రీ రామనవమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.  అయోధ్యలో బాల రాముడు కొలువైన తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అక్కడ  యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు అయోధ్యలో శ్రీరామనవమి రోజున రాముడిని దర్శించుకోవాడానికీ దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల  మంది  వరకు హాజరు కానున్నట్టు సమాచారం.

త్రేతా యుగంలో 14 యేళ్లు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడు.. ఈ కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరడానికి ఐదు వందల యేళ్లు పోరాటాలు చేస్తే కానీ కొలువు తీరలేదు. మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠతో ముగిసింది. ఒక రకంగా ఈ కలియుగంలో జరిగిన అతిపెద్ద మహా క్రతువుగా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠను చెప్పుకోవాలి.  అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే కదా. వీరందరికీ రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. జనవరి 23 నుంచి  నుండి సామాన్య భక్తులకు రామ్ లల్లా దర్శనం అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు.

Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News