Venus Transits 2024: ఫిబ్రవరి 12న లక్ష్మీ నారాయణ యోగం..ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌ ప్రారంభం!

Venus Transits Effect On Zodiac Sign February 2024: శుక్రుడు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఫిబ్రవరి 12వ తేది నుంచి కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సమస్యలు పరిష్కారమవుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 05:24 PM IST
Venus Transits 2024: ఫిబ్రవరి 12న లక్ష్మీ నారాయణ యోగం..ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌ ప్రారంభం!

Venus Transits Effect On Zodiac Sign February 2024: శుక్ర గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సు, ఆనందానికి సూచికగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం రాశి సంచారం చేసినప్పుడు అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే శుక్ర గ్రహం ఈ 12వ (ఫిబ్రవరి నెల) తేదిన ఉదయం 4.40 గంటలకు రాశి సంచారం చేయబోతోంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఇప్పటికే మకర రాశిలో సూర్యుడు, కుజుడు సంచార దశలో ఉన్నారు. ఈ ఫిబ్రవరి 12వ తేదిన శుక్రుడు కలవడం కారణంగా లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా ఫిబ్రవరి 12 నుంచి కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏయే రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషరాశి:
మేషరాశి వారికి ఈ లక్ష్మీ నారాయణ యోగ ప్రభావం ప్రత్యేక్షంగా పడబోతోంది. దీని కారణంగా ప్రేమ సంబంధాలలో మాధుర్యం రెట్టింపు అయ్యే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి ఇంట్లో సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యతు దూరమవుతాయి. ఇక వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నవారికి ఊహించని పురోగతి లభిస్తుంది. 

మిథున రాశి:
ఈ యోగం కారణంగా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి సవాళ్లనైన  ఎదుర్కొంటారని జ్యోతిస్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మతపరమైన వాటిపై ఆసక్తి పెరిగి ఎంతో భక్తితో ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ లభించి కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అలాగే ఎలాంటి పనులైనా ఖచ్చితత్వంతో చేయగలుగుతారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

సింహ రాశి:
సింహ రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం ప్రభావంతో సంతానం కూడా పొందుతారు. అంతేకాకుండా ప్రేమ సంబంధంలో మాధుర్యం పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే సంపాదన రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వ్యాపారాల్లో కూడా పెట్టబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో సుఖవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఛాన్స్‌ కూడా ఉంది. 

ధనుస్సు రాశి:
లక్ష్మీ నారాయణ యోగం ప్రభావం ధనుస్సు రాశి వారిపై కూడా సమానంగా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవంతో పాటు హోదా, కీర్తి, ప్రతిష్టలు కూడా పొందుతారు. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అడ్డంకులు లేకుండా సులభంగా ముగుస్తాయి. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా గుడ్‌ న్యూస్‌ వింటారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News