Ramandeep Catch Video viral: దీపక్ హుడా బిగ్ షాక్.. 'సూపర్‌మ్యాన్'లా గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్ పట్టిన రమణ్ దీప్, వీడియో వైరల్

LSG vs KKR Match: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేకేఆర్ ఫ్లేయర్ రమణదీప్ సింగ్ పట్టిన క్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 14, 2024, 08:39 PM IST
Ramandeep Catch Video viral: దీపక్ హుడా బిగ్ షాక్..  'సూపర్‌మ్యాన్'లా గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్ పట్టిన రమణ్ దీప్, వీడియో వైరల్

Ramandeep Catch Video viral:  ఐపీఎల్ 2024 సీజన్  28వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ ను అయ్యర్ మిచెల్ స్టార్క్ కు ఇచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న దీపక్ హుడా నాల్గో బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. బంతి గాలిలోకి వెళ్ళింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నిలబడిన రమణదీప్ సింగ్ సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌ని చూసిన సహచర ఆటగాళ్లు ఆనందంతో ఎగిరి గంతేశారు. సారథి శ్రేయస్ అయితే ఏకంగా అతడి  దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నాడు. రమణదీప్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ కు షాక్ అయిన దీపక్ హుడా కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సాల్ట్ వీర విహారం.. కేకేఆర్ తిరుగులేని విజయం..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం పది పరుగులే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. రమణదీప్ పట్టిన  అద్బుతమైన క్యాచ్ కు దీపక్ హుడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత బదోని(29), పూరన్(45) బ్యాట్ ఝలిపించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేజింగ్ కు దిగిన కేకేఆర్ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఫిల్ సాల్ట్ పిచ్చకొట్టుడు కొట్టాడు. నరైన్, రఘువంశీ విఫలమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండతో సాల్ట్ రెచ్చిపోయాడు. లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. అతడు కేవలం 47 బంతుల్లోనే 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు అయ్యర్ 38 బంతుల్లో 38 రన్స్ చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు ఉన్నాయి. లక్నో బౌలర్లలో మోహిసిన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. 

Also Read: Yashasvi Jaiswal GF: యశస్వి జైస్వాల్ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను మించిన అందగత్తె..!

Also read: Yuzvendra Chahal: ఐపీఎల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్న చాహల్.. అదేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News