Bandi Sanjay Kumar: కేసీఆర్ వల్లే పాతబస్తీలో ఉగ్రవాదులకు రేషన్ కార్డులు

Fake Birth Certificates In Hyderabad: కేసీఆర్ పాలనలో పాత బస్తీ ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. అడుగడుగునా స్లీపర్ సెల్స్‌ని పెంచి పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, ఉగ్రదాడులు జరిగినా.. వాటి మూలాలు పాతబస్తీలోనే బయటపడుతున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ మండిపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2023, 05:15 AM IST
Bandi Sanjay Kumar: కేసీఆర్ వల్లే పాతబస్తీలో ఉగ్రవాదులకు రేషన్ కార్డులు

Fake Birth Certificates In Hyderabad: పాత బస్తీలో ఇబ్బడి ముబ్బడిగా బర్త్ సర్టిఫికెట్స్ జారీచేస్తున్నారని.. వాటితో బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉగ్రవాదులు పాస్‌పోర్టులు, రేషన్ కార్డులు పొంది స్థానికులుగా చలామణి అవుతున్నారని కరీంనగర్ ఎంపీ, బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. బర్త్ సర్టిఫికేట్ల జారీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్ పాలనలో పాత బస్తీ ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. అడుగడుగునా స్లీపర్ సెల్స్‌ని పెంచి పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, ఉగ్రదాడులు జరిగినా.. వాటి మూలాలు పాతబస్తీలోనే బయటపడుతున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదు. పాతబస్తీ ఓట్లు, సీట్ల కోసం ఆ ప్రాంతాన్ని ఎంఐఎం పార్టీకి ధారాదత్తం చేశాడు అంటూ కేసీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు. నగరంలో అల్లర్లు సృష్టించడం ద్వారా కేంద్రాన్ని బదనాం చేసి.. తద్వారా రాజకీయ లబ్ది పొందాలని బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయి అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నిబంధనలకు వ్యతిరేకంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా 27 వేలకుపైగా బర్త్ సర్టిఫికెట్స్, 4 వేలకుపైగా డెత్ సర్టిఫికెట్లను జారీ చేసినట్టు టాస్క్ ఫోర్స్ దాడుల్లో తేలింది. జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లలో అత్యధిక సంఖ్యలో పాతబస్తీకి చెందినవే కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అంతులేని అవినీతికి ఇది నిదర్శనం. దీనికంతటికి మొదటి ముద్దాయి సీఎం కేసీఆరే. అందుకే ఈ మొత్తానికి కారకుడైన కేసీఆర్ నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?

ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News