Rashmika - Devarakonda: దేవరకొండతో కలిసి మాల్దీవులకు రష్మిక.. 'అవి' పెట్టుకోవడంతో అడ్డంగా బుక్కయ్యారుగా!

Rashmika Wore Vijay Devarakonda's Sunglasses in Her maldives Vacation: తన వెకేషన్లో రష్మిక విజయ్ దేవరకొండ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 9, 2022, 01:21 PM IST
Rashmika - Devarakonda: దేవరకొండతో కలిసి మాల్దీవులకు రష్మిక.. 'అవి' పెట్టుకోవడంతో అడ్డంగా బుక్కయ్యారుగా!

Rashmika Wore Vijay Devarakonda's Sunglasses in Her maldives Vacation: విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ప్రేమ బంధం ఉందనే ప్రచారం ఇప్పటిది కాదు. వీరిద్దరూ కలిసి గీతగోవిందం అనే సినిమాలో నటించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. నిజానికి రష్మిక చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఆమెకు గీతగోవిందం సినిమాలో అవకాశం వచ్చిందిల చలో సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే ఆమె కన్నడలో పలు సినిమాలు చేసింది. ఇలా ఒక సినిమాలో తన కోస్టార్ అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఏకంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

ఇక త్వరలో పెళ్లి జరగబోతుంది అనుకుంటున్నా సమయంలో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు మొదలవడంతో ఆమె వివాహాన్ని రద్దు చేసుకుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండకు లిప్ లాక్ ఇచ్చిన తర్వాతే ఆమె విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిపోయింది అని అందుకే రక్షిత్ శెట్టికీ బ్రేకప్ చెప్పి పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుందనే ప్రచారం ఉంది. దానికి తోడు తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా ఇద్దరూ కలిసి పని చేయడం అందులో కూడా ఒక లిప్ లాక్ ఉండడం వంటి విషయాలను కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా సంకేతాలు ప్రేక్షకులకు సాధారణ జనానికి పంపినట్లు అయింది.

అయితే ఈ విషయం మీద ఈ ఇద్దరు పలు సందర్భాల్లో తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఆ మధ్య ఒక పండుగ సందర్భంగా విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి రష్మిక ఉన్నట్లు ఉన్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అంటే విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి రష్మిక ఫోటో దిగలేదు కానీ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్, రష్మిక పోస్ట్ చేసిన ఫోటోల్లో కూడా కనిపించడంతో వీరంతా కలిసే ఉన్నారని సంకేతాలు పంపినట్లు అయింది. పండుగల కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఏదో ఉండనే కామెంట్స్ అప్పట్లో గట్టిగానే వినిపించాయి.

ఆ తర్వాత మళ్లీ సర్వసాధారణం అయిపోయింది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకోవడంతో కాస్త నిరాశ పాలయ్యాడు. రష్మిక మాత్రం వరస సినిమా అవకాశాలతో సూపర్ హిట్స్ అందుకుంటుంది. ఆమె ఇటీవల నటించిన గుడ్ బై అనే సినిమా కూడా బాలీవుడ్ లో మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్తితులు కనిపిస్తున్నా సరే టాక్ పరంగా అలాగే నటనా పరంగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమె వెకేషన్కు మాల్దీవులకు పయనం అయింది. ఆమె ఇలా వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆసక్తికరంగా ఆమె ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లిన కొద్దిసేపటికి విజయ్ దేవరకొండ కూడా లోపలికి వెళ్లడంతో రష్మికతో కలిసి విజయ్ దేవరకొండ మాల్దీవులకు వెళుతున్నారని ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారం అయితే జరిగింది కానీ ఇప్పటివరకు కలిసి వెళ్లారు అనే విషయానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు, కానీ ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో పెట్టుకున్న కళ్లద్దాలు రష్మిక తన మాల్దీవుల వెకేషన్ ధరించి ఫోటోలు  షేర్ చేయడంతో  వీళ్లిద్దరి బంధం నిజమేనని, ఇప్పుడు ఎలా అడ్డంగా బుక్ అయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Also Read: Mistakes in God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఈ తప్పులని మీరు గమనించారా?

Also Read: Godfather Day 4 Collections: ఊపందుకున్న గాడ్ ఫాదర్.. మూడో రోజు కంటే పెరిగిన వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News