Sreeleela: ఆ ఇండస్ట్రీలో జోరు పెంచిన శ్రీలీల.. వరుస ఆఫర్లతో టాప్‌ గేర్‌.. కానీ తెలుగులో ఇలా..!

Sreeleela Next Movie : తెలుగులో వరుస డిజాస్టర్లు అందుకున్న శ్రీలీలకి.. ఇంక ఇక్కడ ఆఫర్లు రావడం కష్టమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఇప్పుడు ఈ భామ తమిళ్లో స్టార్ హీరోలతో.. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ అందరికీ షాక్ మీద షాక్ ఇస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 8, 2024, 07:36 PM IST
Sreeleela: ఆ ఇండస్ట్రీలో జోరు పెంచిన శ్రీలీల.. వరుస ఆఫర్లతో టాప్‌ గేర్‌.. కానీ తెలుగులో ఇలా..!

Sreeleela Upcoming Movies : 2021లో పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల.. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. భగవంత్ కేసరి సినిమాతో కూడా మెప్పించిన శ్రీలీల స్కంద, ఆది కేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటూ వరుసగా మూడు డిజాస్టర్లు అందుకుంది.

ఇక మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన గుంటూరు కారం సినిమా కూడా.. అంత చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో శ్రీలీల కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది.. అని కొందరు కామెంట్లు చేశారు. కానీ తాజాగా ఈ భామ తమిళ్ స్టార్ హీరోలతో సినిమా ఆఫర్లను.. అందుకుంటూ అందరికీ షాక్ ఇస్తోంది. తెలుగులో ఆఫర్లు కరువైపోయినప్పటికీ, తమిళ్ నుంచి మాత్రం శ్రీలీల కి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ మధ్యనే అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ.. సినిమాలో అవకాశాన్ని అందుకున్న శ్రీలీల.. తాజాగా ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న మరొక సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది. 

ఇదిలా ఉండగా కార్తీ హీరోగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ చిత్రీకరిస్తున్న ఒక సినిమాలో కూడా.. శ్రీలీలనే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం శ్రీలీల పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఈ సినిమా మినహా ఆమెకు పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమీ లేవు. ఆ తరువాత కూడా ఛాన్సులు వస్తాయా లేదా అనే అనుమానం ప్రస్తుతానికి తెలుగులో ఆమెను వెంటాడుతూ ఉంది. కానీ తెలుగు తెరపై ఇప్పట్లో కనిపించకపోయినా శ్రీలీలా తమిళ్లో మాత్రం వరుస ఆఫర్లతో ముందుకు దూసుకు వెళ్తోంది. ఈ క్రమంలో చేసినవి కొన్ని సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న శ్రీలీల.. మళ్ళీ తెలుగు తెరపై కూడా మెరవాలి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Narendra Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీ

Also Read: Vijayashanthi: విజయశాంతి ఎక్కడా? ప్రచారంలో కానరాని రాములమ్మ.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా?

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News