Tamannaah Bhatia Dinner Date : కారులో లవర్‌తో తమన్నా.. డిన్నర్ పార్టీ కోసం బయటకు వచ్చిన బ్యూటీ

Tamannaah Bhatia Dinner Date తమన్నా ప్రస్తుతం ముంబైలో తన ప్రియుడితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో మునిగి తేలిపోతోందని గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ వర్మతో తమన్నా కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 01:18 PM IST
  • నెట్టింట్లో తమన్నా సందడి
  • బాయ్ ఫ్రెండ్‌తో మిల్కీ బ్యూటీ
  • కారులో కనిపించిన తమన్నా
Tamannaah Bhatia Dinner Date : కారులో లవర్‌తో తమన్నా.. డిన్నర్ పార్టీ కోసం బయటకు వచ్చిన బ్యూటీ

Tamannaah Bhatia Dinner Date  మిల్కీ బ్యూటీ తమన్నాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తమన్నా ప్రేమ, పెళ్లి విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా, తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి కనిపించింది. ముద్దులు పెట్టుకుంటూ అలా కనిపించడంతో ఒక్కసారిగా తమన్నా పేరు వైరల్ కాసాగింది. తమన్నా డేటింగ్, ప్రేమ వ్యవహారంతో విజయ్ వర్మ సైతం హాట్ టాపిక్‌గా మారాడు.

ఇప్పుడు మరోసారి విజయ్ వర్మ తమన్నా వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న ముంబైలో రాత్రి డిన్నర్ డేట్‌కు ఈ ఇద్దరూ బయటకు వచ్చారని తెలుస్తోంది. ఇక డిన్నర్ ముగించుకుని బయటకు వెళ్లే టైంలో ఇలా కెమెరా కంటికి చిక్కారు. ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీస్తూనే  ఉన్నా కూడా తమన్నా అంతగా పట్టించుకోలేదు. కారులో ఎక్కి వెళ్తుండగా.. ఫోటో గ్రాఫర్లకు బాయ్ చెబుతూ చేతులు ఊపేసింది.

తమన్నాకు ఇప్పుడు తెలుగులో క్రేజ్ లేకుండా పోయింది. ఆమె నటించిన సినిమాలు కూడా అంతగా ఆడటం లేదు. విలన్‌గా నటించిన నితిన్ మాస్ట్రో సినిమా పర్వాలేదనిపించింది. తమన్నాలోని ఇంకో కోణాన్ని చూపించింది. ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. తమన్నా గోపీచంద్ కాంబోలో వచ్చిన సీటీమార్ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

తమన్నా బబ్లీ బౌన్సర్ అంటూ బాక్సర్‌గా నటించింది. కానీ ఈ చిత్రం కూడా అంతగా మెప్పించలేకపోయింది. హిందీలో తమన్నాకు అంతో ఇంతో ఆఫర్లు వస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రం ఆమెను ఎక్కువగా తీసుకోవడం లేదు. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తోంది తమన్నా. వెంకటేష్‌ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్ 3 సినిమాలో తమన్నా తన ఓవర్ యాక్షన్‌తో జనాలను విసిగించిందనే ట్రోల్స్, మీమ్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News