First Income tax: దేశంలో తొలిసారి ఇన్‌కంటాక్స్ ఎప్పుడు, ఎవరు విధించారు, ఎలా ప్రారంభమైంది

First Income tax: ఇన్‌కంటాక్స్. బడ్జెట్ వచ్చిన ప్రతిసారీ ఇదే చర్చనీయాంశమౌతుంటుంది. ఎందుకంటే ట్యాక్స్ డిడక్షన్ నొప్పి ఎలా ఉంటుందో ఆదాయ వర్గాలకే తెలుస్తుంటుంది. అందుకే ప్రతియేటా బడ్జెట్ ప్రకటనపై ఆదాయవర్గాలు ఆశగా చూస్తుంటారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2024, 07:21 AM IST
First Income tax: దేశంలో తొలిసారి ఇన్‌కంటాక్స్ ఎప్పుడు, ఎవరు విధించారు, ఎలా ప్రారంభమైంది

First Income tax: కష్టపడి సంపాదించే ఆదాయంలో కీలకమైన భాగం ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంటే ఎవరికైనా బాధే ఉంటుంది. అందుకే బడ్జెట్ వచ్చిన ప్రతిసారీ ట్యాక్స్ మినహాయింపులేమున్నాయని ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగవర్గాలకు చాలా అంచనాలుంటుంటాయి. రేపు అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సహజంగానే ఆదాయ వర్గాలకు చాలా ఆశలున్నాయి. అసలు ఇన్‌కంటాక్స్ దేశంలో ఎప్పుుడు, ఎలా ప్రారంభమైందనే వివరాలు తెలుసుకుందాం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లే అయినా అంతకు మరో వందేళ్ల ముందు నుంచే అంటే మొత్తం 160 ఏల్ల క్రితమే ఇన్‌కంటాక్స్ చరిత్ర ప్రారంభమైంది. ఆ సమయంలో 200 రూపాయలు కంటే ఎక్కువ సంపాదిస్తుంటే ఇన్‌కంటాక్స్ కట్ అవుతుండేది. 1860లో మొట్టమొదటిసారిగా బ్రిటీషన్లు ఇండియాలో ఇన్‌కంటాక్స్ తొలి చట్టాన్ని అమలు చేశారు. బ్రిటీషు అధికారి జేమ్స్ విల్సన్ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులోనే ఇన్‌కంటాక్స్ చట్టాన్ని చేర్చారు. 

200 రూపాయలు దాటితే ట్యాక్స్

ఇండియాలో బ్రిటీషర్ల సమయంలోనే ఇన్‌కంటాక్స్ కధ మొదలైంది. దేశంలో ఆ సమయంలో తొలి బడ్జెట్ లో 200 రూపాయల కంటే ఆదాయం దాటితే ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది. ఏడాదికి 200-500 రూపాయల ఆదాయంపై 2 శాతం ట్యాక్స్ ఉండేది. 500 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 4 శాతం ట్యాక్స్ ఉండేది. ఇన్‌కంటాక్స్ పరిధి నుంచి అప్పట్లో ఆర్మీ, నావీ, పోలీసు సిబ్బందికి మినహాయింపు ఉండేది. అప్పట్లో ఇన్‌కంటాక్స్ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

ఇన్‌కంటాక్స్ ఎలా పుట్టింది అసలు

దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాటం ఉధృతమౌతున్న రోజులవి. బ్రిటీషు ప్రభుత్వం ఆర్మీపై ఖర్చు పెంచేసింది. 1857-58లో 2 కోట్ల 10 లక్షల పౌండ్లు చేసింది.  ఖర్చు పెరగడంతో నియంత్రించేందుకు బ్రిటీషు ప్రభుత్వం 1859 నవంబర్ నెలలో జేమ్స్ విల్సన్‌ను ఇండియాకు పంపింది. ఆర్మీపై పెడుతున్న ఖర్చు లోటును భర్తీ చేసేందుకు అతడు 1860 ఫిబ్రవరి 18న తొలిసారిగా ఇన్‌కంటాక్స్ ప్రొవిజన్ తీసుకొచ్చాడు. ఇందులో ఇన్‌కంటాక్స్‌తో పాుట లైసెన్స్ ట్యాక్స్, టొబాకో ట్యాక్స్ ఉండేది. అలా ఇన్‌కంటాక్స్ కధ దేశంలో ప్రారంభమైంది. 1922లో కొత్త ఇన్‌కంటాక్స్ చట్టం వచ్చింది. ఆ తరువాతే ఇన్‌కంటాక్స్ శాఖ మొదలైంది. 

Also read: India First Budget: దేశంలో తొలి బడ్జెట్ ఎప్పుడు, ఎన్ని కోట్లకు ప్రవేశపెట్టారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News