Imran Khan: భారత్ పని తీరు భేష్‌..పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రశంస..!

Imran Khan: పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 02:15 PM IST
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం
  • పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించిన మోదీ సర్కార్
  • మోదీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు
Imran Khan: భారత్ పని తీరు భేష్‌..పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రశంస..!

Imran Khan: పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. ఈక్రమంలోనే మరోసారి భారత్‌ను పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశంసించారు. భారత్‌లో పెట్రోల్, డీజిల్ తగ్గించడం హర్షం వ్యక్తం చేశారు. క్వాడ్‌లో భారత్‌ సభ్య దేశం అయినా..అగ్ర దేశాల నుంచి ఒత్తిడి ఉన్నా..రష్యా నుంచి చమురును రాయితీతో దిగుమతి చేసుకోగలిగిందని ప్రశంసించారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్ ముందుకు వెళ్తోందన్నారు. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ పాలనలో పాక్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తి దెబ్బతిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని స్పష్టం చేశారు. షెహబాబ్ షరీఫ్‌ ప్రభుత్వంలోని కొందరూ ఇతరులకు లొంగిపోయారని మండిపడ్డారు. భారత్‌లో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే ట్విట్టర్‌లో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. 

అంతకముందు పలుమార్లు భారత్‌ తీరును ఇమ్రాన్‌ ఖాన్ ప్రశంసించారు. భారత దేశాన్ని ఏ పవర్‌ ఆపలేదని వ్యాఖ్యనిచ్చారు. అక్కడి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయమన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారత్ తెలివిగా వ్యవహరించిందని చెప్పారు. అగ్ర రాజ్యాలు సైతం ఏమి అనలేకపోయాయన్నారు. భారతీయుల్లో విపరీతమైన ఆత్మగౌరవం ఉంటుందన్నారు.  దీనిపై అప్పట్లో పెను దుమారం రేగింది. ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై పాక్‌ నేతలు మండిపడ్డారు. 

Also read:Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌కు మరోసారి ప్రజ్ఞానంద షాక్!

Also read:Telangana BJP: రాష్ట్రంలో కమలనాథుల జోష్..బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ఎప్పుడంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News